ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎనిమిది మంది మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై లక్నో నుండి ఢిల్లీకి వెళుతుండగా.. సక్రవా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిష్రాబాద్ గ్రామ సమీపంలో ఆపి ఉంచిన వాటర్ ట్యాంకర్‌ను స్లీపర్ బస్సు ఢీకొట్టింది.

By Medi Samrat  Published on  6 Dec 2024 4:49 PM IST
ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎనిమిది మంది మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై లక్నో నుండి ఢిల్లీకి వెళుతుండగా.. సక్రవా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిష్రాబాద్ గ్రామ సమీపంలో ఆపి ఉంచిన వాటర్ ట్యాంకర్‌ను స్లీపర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు బ‌లంగా ఢీకొని బోల్తా పడ‌గా.. బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు.

పోలీసులు క్షతగాత్రులను సైఫాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. మృత దేహాలను కూడా సైఫాయికి పంపించారు. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఆగిపోయారు. వెంటనే డీఎం-ఎస్పీకి ఫోన్ చేసి ప్రమాదం గురించి తెలియజేశారు. ప్రమాదానికి గురైన బస్సు రాజ్ కల్పనా ట్రావెల్స్, గోఖలే మార్కెట్, హజారీ కోర్ట్ గేట్ నంబర్ 5, మోరీ గేట్, ఢిల్లీకి చెందినది. జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ కాన్వాయ్‌ని ఆపి ప్రమాదం గురించి సమాచారం తీసుకున్నారు.

Next Story