ఆదివారం ఉదయం లూథియానాలోని మోహర్బన్‌ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చుహర్వాల్‌లో 70 ఏళ్ల వృద్ధురాలిని 22 ఏళ్ల యువకుడు వంటగది కత్తితో పొడిచి చంపారు. బాధితురాలు గురుద్వారాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడు, అతని తల్లి.. వృద్ధ మహిళ తమకు చేతబడి చేస్తున్నట్లు అనుమానించారు. శనివారం రాత్రి తల్లీ కొడుకులిద్దరూ వృద్ధురాలితో మాటల వాగ్వివాదానికి పాల్పడ్డారు. కాగా హత్యకు గురైన వృద్ధురాలిని స్వరణ్ కౌర్‌గా గుర్తించారు. నిందితుడు జస్పాల్ సింగ్ జస్సా నిరుద్యోగి. అతని తల్లి చుహర్వాల్ గ్రామానికి చెందిన సత్నామ్ కౌర్.

కాగా ఈ ఘటన పై వృద్ధురాలి కుమారుడు గుర్‌మైల్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాను, తన తల్లి ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పూజ చేసేందుకు గురుద్వారాకు వెళుతుండగా, నిందితులు తన తల్లిని స్వరణ్‌ కౌర్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచినట్లు ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపారు. నిందితుడు అప్పటికే రోడ్డుపై దాక్కున్నాడని, మా అమ్మ టర్న్ తీసుకున్నాక కత్తితో పొడిచి చంపాడని సింగ్ చెప్పాడు.

తెలిసిన వివరాల ప్రకారం.. నిందితుడు బాధితురాలిపై దుర్భాషలాడాడు. ఆమె చేతబడి చేశాడని ఆరోపించాడు. బాధితురాలి కుమారుడు.. తన తల్లి అరుపులు విన్నప్పుడు అతను వేగంగా పరుగెత్తాడని, నిందితుడిని ఆపాడని, అయితే అతను అక్కడి నుండి పారిపోయాడని చెప్పాడు. తీవ్ర రక్తస్రావమైన వృద్ధురాలు కౌర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు జస్పాల్ సింగ్‌పై హత్య కేసు నమోదు చేశారు. నేరపూరిత కుట్ర ఆరోపణలపై అతని తల్లిని అరెస్టు చేశారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story