ట్రాక్టర్‌ను ఢీకొట్టిన పెళ్లి కారు.. ఏడుగురు దుర్మరణం

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు.

By అంజి  Published on  18 March 2024 9:44 AM IST
Crimenews, Roadaccident, wedding, tractor, Bihar

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన పెళ్లి కారు.. ఏడుగురు దుర్మరణం

బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ పంపు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్‌హెచ్ 31లో కారులో ప్రయాణిస్తున్న బాధితులు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు గోగ్రీ డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఖగారియా సదర్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లాలోని తుట్టి మోహన్‌పూర్ గ్రామం నుండి మర్హయ్య బిత్లా గ్రామానికి వివాహ బృందం తిరిగి వస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.

Next Story