లడఖ్‌లోని తుర్టుక్ సెక్టార్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు భారత ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి వైద్యాన్ని అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని వెస్ట్రన్ కమాండ్‌కు తరలించడానికి భారత వైమానిక దళం సహాయాన్ని కోరినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
తాజా అప్‌డేట్‌ల ప్రకారం.. 26 మంది సైనికుల బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళుతోంది. ఉదయం 9 గంటలకు, థోయిస్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో, వాహనం రోడ్డుపై నుండి జారిపడి ష్యోక్ నదిలో (సుమారు 50-60 అడుగుల లోతులో) పడిపోయింది. ఈ ప్రమాదంలో సైనికులందరికీ గాయాలు అయ్యాయి. మొత్తం 26 మంది వ్యక్తులను పార్తాపూర్‌లోని 403 ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు.
"26 మంది సైనికులతో కూడిన బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళుతోంది. వాహనం రోడ్డుపై నుండి జారి షియోక్ నదిలో పడిపోవడంతో అందులో ఉన్న వారందరికీ గాయాలు అయ్యాయి" అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 26 మంది సైనికులను ఆర్మీ ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. లేహ్ నుండి వైద్య బృందాలను పార్తాపూర్‌కు తరలించారు.