కేరళ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొచ్చిలోని మూతకున్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీలో ఉన్న నర్సుపై 65 ఏళ్ల వృద్ధుడి అత్యాచారానికి యత్నించాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సుధీగా గుర్తించబడ్డాడు. అతను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరచుగా వచ్చే మూతకున్నం స్థానికుడు. అయితే ఆదివారం నాడు సుధీగా ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉన్న నర్సుపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

నర్సును వృద్ధుడు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించిన వెంటనే సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. దీని తరువాత చాలా మంది ప్రజలు వెంటనే అక్కడికి చేరుకున్నారని వడకెక్కరా స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత వృద్ధుడు అక్కడి నుండి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. అంతేకాదు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story