48 సంవత్సరాల మహిళపై యాసిడ్ పోసిన.. 60 ఏళ్ల వ్యక్తి
60 year old man threw acid on 48 year old girlfriend. బీహార్ రాష్ట్రంలోని బెట్టియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 22 May 2022 7:15 PM ISTబీహార్ రాష్ట్రంలోని బెట్టియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు ఓ మహిళను ఎంతగానో ప్రేమించాడు. అతను తన ప్రియురాలిపై యాసిడ్ పోశాడు. బెట్టియాలో నివసిస్తున్న 60 ఏళ్ల వ్యక్తి, 48 ఏళ్ల మహిళ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పిల్లల కారణంగా సదరు మహిళ అతడిని గత కొద్దిరోజులుగా దూరం పెట్టింది. దీంతో ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడింది. ప్రియురాలిపై యాసిడ్ పోశాడు. ఈ సంఘటన నర్కటియాగంజ్ షికార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్గజ్వా గ్రామంలో చోటు చేసుకుంది.
బాధితురాలు రాత్రి సమయంలో తన ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు.. 60 సంవత్సరాల కాసిం మియాన్ అనే వ్యక్తి నిశ్శబ్దంగా ఇంటిలోకి వచ్చి యాసిడ్ పోసి పారిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆమె తీవ్రంగా కాలిపోయింది. ఉదయం కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని బాధితురాలు చెబుతోంది.
నిందితుడి భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఆ తర్వాత ఆ మహిళతో ప్రేమలో ఉన్నాడు. చాలా ఏళ్లుగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ పిల్లల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఒకే ఊరిలో నివసించడంతో అప్పుడప్పుడు ఒకరికొకరు ఎదురయ్యేవారు. నిందితుడి పిల్లలిద్దరికీ పెళ్లయిందని పోలీసులకు తెలిపాడు. తాను యాసిడ్ పోయలేదని.. బలవంతంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని 60 ఏళ్ల బాధితుడు చెప్పుకొచ్చాడు.