అవును.. వారు ఏకంగా బ్రిడ్జినే దొంగిలించేశారు

60-Foot Bridge Stolen In Bihar. బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో 60 అడుగుల పాడుబడిన వంతెనను పట్టపగలు దొంగిలించేశారు.

By Medi Samrat  Published on  9 April 2022 1:30 PM GMT
అవును.. వారు ఏకంగా బ్రిడ్జినే దొంగిలించేశారు

బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో 60 అడుగుల పాడుబడిన వంతెనను పట్టపగలు దొంగిలించేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ దొంగలు గ్యాస్ కట్టర్లు, ఎర్త్ మూవర్ మిషన్లతో వంతెనను కూల్చివేసి వాటితో పరారైనట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ కొందరు జేసీబీ, గ్యాస్ కట్టర్ వంటి యంత్రాలతో వంతెనను కూల్చివేశారని గ్రామస్తులు తమకు సమాచారం అందించారని నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజనీర్ అర్షద్ కమల్ షంషీ తెలిపారు. తాము ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశామని షంషీ తెలిపారు.

"ఇరిగేషన్ శాఖ అధికారులుగా నటిస్తూ కొందరు వ్యక్తులు శిథిలావస్థలో ఉన్.. పాడుబడిన కాలువ వంతెన వద్దకు వచ్చి దానిని పూర్తిగా JCB యంత్రాలు, గ్యాస్ కట్టర్ల సహాయంతో కూల్చివేసినట్లు గ్రామస్థులు తెలియజేసారు" అని షంషీ చెప్పారు. 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న వంతెన ఒక్కసారిగా మాయమైపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ శాఖ అధికారులు నస్రీగంజ్ పోలీస్ స్టేషన్‌లో దొంగలపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 1972లో అమియావర్‌లోని ఆరా కాలువపై వంతెన నిర్మించబడింది.

వంతెన అదృశ్యం కావడం ఇదే మొదటిసారి కాదు. 2012లో, చెక్ రిపబ్లిక్‌లో పగటిపూట దొంగలు ఒక వంతెనను దొంగిలించారు. దానిని కూల్చివేయడానికి తమను అధికారులు పంపించారని పేర్కొన్నారు. అంతకు ముందు సంవత్సరం, USలోని పెన్సిల్వేనియాలో ఒక వంతెన నుండి $100,000 విలువైన ఉక్కును దొంగలు తీసుకుని వెళ్లారు. 2004లో, ఉక్రెయిన్‌లోని 36 అడుగుల ఉక్కు వంతెన స్క్రాప్ మెటల్ కోసం దొంగిలించబడింది.












Next Story