ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే.. మండవాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మిర్జాపూర్‌ గ్రామంలో ఓ చిన్నారి పాఠశాలకు బయల్దేరింది. దారిలో షహబాజ్‌ అనే వ్యక్తి ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడి తన కామవాంఛ తీర్చుకుని వదిలి పెట్టాడు. ఆ తర్వాత ప్రాణాలతో ఇంటికి వచ్చిన చిన్నారి జరిగిన భయానక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్సన్‌ 376, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు షహబాజ్‌(27)ను అరెస్ట్‌ చేశామని బిజనోర్‌ సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్‌ ధరమ్‌ వీర్‌ సింగ్‌ తెలిపారు. అఘాయిత్యానికి గురైన ఆరేళ్ల బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోతోంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, ఆడ, మగ అనే తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు మానవ మృగాలు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story