సిక్కింలోని నాథులా సరిహద్దు ప్రాంతంలో భారీ హిమపాతం సంభవించడంతో మంగళవారం ఆరుగురు పర్యాటకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇంకా కొందరు మిస్సింగ్ అని అధికారులు తెలిపారు. గాంగ్‌టక్‌ను నాథులాతో కలిపే జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డులోని 14వ మైలు వద్ద హిమపాతం సంభవించడంతో చాలా మంది పర్యాటకులు ఇరుక్కుపోయారు. ఇప్పటి వరకు 22 మంది పర్యాటకులను రక్షించినట్లు BRO తెలిపారు. రోడ్డుపై మంచును తొలగించడానికి అధికారులు చాలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే చిక్కుకుపోయిన 350 మంది పర్యాటకులను, 80 వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 150 మందికి పైగా జనం చిక్కుకుపోయారని భావిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు హిమపాతం సంభవించింది. క్షతగాత్రులను రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లోని ఆసుపత్రికి తరలించారు. "రెస్క్యూ క్లియరెన్స్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.