Jagtial : బొమ్మ తుపాకీలతో ఎలాంటి పనులు చేశారంటే.?

బీర్‌పూర్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి జగిత్యాల పోలీసులు శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  21 Dec 2024 6:15 AM IST
Jagtial : బొమ్మ తుపాకీలతో ఎలాంటి పనులు చేశారంటే.?

బీర్‌పూర్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి జగిత్యాల పోలీసులు శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశారు. 5 లక్షల విలువైన దొంగిలించిన వస్తువులు, నేరానికి ఉపయోగించిన రెండు బొమ్మ పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నిందితులు బొమ్మ తుపాకీలను ఉపయోగించి దోపిడీలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఇటీవల కిరాణా దుకాణం యజమాని నివాసంలోకి చొరబడి బొమ్మ పిస్టల్స్‌తో బెదిరించి దాడికి పాల్పడ్డారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. అతని భార్యను కూడా బెదిరించి, ఇద్దరినీ కట్టేసి, ఇంట్లో ఉన్న నగదు, విలువైన వస్తువులను తీసుకొని పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Next Story