ఇటీవలి కాలంలో గౌహతి పేరు చాలా కారణాల వలన వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా మర్డర్ , రేప్ ఘటనలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయని ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రైమ్ లను ఎలాగైనా ఆపాలని వారు కోరుతూ ఉన్నారు. నగరంలోని పాండు ప్రాంతంలో మైనర్ బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. జలాలుద్దీన్ అనే వ్యక్తి పాండు ప్రాంతంలోని మైనర్ ఇంట్లోకి ఆమెపై అత్యాచారం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రవేశించాడు. ఇంతలో, బాలిక గట్టిగా అరవడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. అందరూ కలిసి ఆ వ్యక్తిని కట్టేసి కొట్టి, తర్వాత జలుక్‌బరి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

అక్టోబరు నెలలో అస్సాంలోని ఉదల్‌గురి జిల్లా పనేరిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు 50 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ మహతో (50) అనే వ్యక్తి తన పొరుగున ఉన్న 10 ఏళ్ల బాలికపై ఆమె నివాసంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటన జరిగినప్పుడు బాధితురాలి తల్లిదండ్రులు తమ పనికి వెళ్లగా, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించి 20 రూపాయలు ఇస్తామని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. 20 రూపాయలు ఇస్తానని తన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేశాడని ఆమె తల్లి ఆరోపించింది.


M.S.R

నేను M.S.R., న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో కహానియా, చిత్రం భళారే, న్యూసు, పబ్లిక్ టీవీ తెలుగు త‌దిత‌ర వార్త సంస్థ‌ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story