సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం.. మేనల్లుడు సహా ఆరుగురు మృతి
5 Members of Sushant Singh Rajput’s family killed in road accident.దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో
By తోట వంశీ కుమార్ Published on
16 Nov 2021 11:53 AM GMT

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుశాంత్ బంధువు ఓం ప్రకాశ్ సింగ్ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సుశాంత్ బంధువు ఓం ప్రకాష్ సోదరి అంత్యక్రియలకు హాజరైన బంధువులు కారులో 10 మంది మంగళవారం ఉదయం పాట్నాకు బయలుదేరారు. లఖిసరాయ్ జిల్లా వద్దకు వచ్చేసరికి వారి కారును ట్రక్ ఢీ కొట్టింది. ఆరుగురు ఘటనాస్థలంలోనే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో సుశాంత్ మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఓం ప్రకాశ్ సింగ్ సమీప బంధువులు ఉన్నారు. దీంతో మరోసారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Next Story