ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

5 killed, 1 injured in car-truck collision in Rajasthan's Hanumangarh. హనుమాన్‌ఘర్‌ మెగా హైవేపై నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా

By Medi Samrat  Published on  1 Jan 2023 9:15 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం
హనుమాన్‌ఘర్‌ మెగా హైవేపై నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జిల్లా బిస్రాసర్ గ్రామ సమీపంలోని హైవేపై కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


Next Story