ఢిల్లీ-జైపూర్ హైవేపై ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఝర్సా ఫ్లై ఓవర్ సమీపంలోని ఎగ్జిట్ 9 వద్ద అదుపు తప్పిన నల్లటి థార్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఢిల్లీ నుంచి జైపూర్ వైపు వెళ్తున్న ఈ యూపీ నంబర్ థార్‌లో ముగ్గురు యువతులు, ముగ్గురు యువకులు ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాహనం అతివేగం కారణంగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదం రోడ్డు భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.