45 వెడ్స్ 25.. అప్పట్లో వైరల్.. నేడు విషాదం
45 Year Old Man commits suicide after marrying 25 year old girl in Karnataka.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అపురూప
By తోట వంశీ కుమార్ Published on 30 March 2022 9:08 AM ISTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అపురూప ఘట్టం. దాదాపుగా ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటుంటారు. అయితే.. కొందరి వివాహాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. వారి పెళ్లి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా నెటీజన్లు ఆకర్షించిన వివాహల్లో కర్ణాటకకు చెందిన 45 వెడ్స్ 25 ఒకటి. అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో నేడు విషాదంగా మిగిలింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని చౌడనకుప్పెకు చెందిన శంకరప్ప ఓ మోతు బరి రైతు. తనకు తెలిసిన మెళకువలతో వివిధ పంటలను సాగుచేస్తూ మంచిగానే సంపాదించాడు. అయితే.. 45 ఏళ్లు వచ్చినా అతడికి పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు చూసినా అవి పెళ్లి వరకు వెళ్లేవి కావు. ఇంతలో పొరుగు గ్రామంలో ఉండే మేఘనాతో అతడికి పరిచమైంది. అప్పటికే ఆమెకు వివాహమైన భర్త ఇంటి నుంచి పారిపోయాడు. రెండేళ్లు అయినా తిరిగి రాలేదు.
శంకరప్ప, మేఘన లు ఇద్దరు ఇష్టపడ్డారు. ఇద్దరూ 2021 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. 45 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎవ్వరు ఏమన్నప్పటికీ..భార్యను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు శంకరప్ప. అయితే.. బెంగళూరులో స్థిరపడాలని మేఘన.. శంకరప్పను ఒత్తిడి చేసేందని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకోసం గ్రామంలో ఉన్న ఆస్తిని విక్రయించాలని పట్టుబట్టిందని ఆరోపిస్తున్నారు. ఓ వైపు వృద్దురాలు అయిన తల్లిని కాదని, భార్య మాటలు విని ఆస్తిని విక్రయించడం అతడికి ఇష్టం లేదు. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కూడా ఈ విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపంలో బయటకు వెళ్లిన శంకరప్ప.. మంగళవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.