పెద్దపల్లిలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. 40 మందికి గాయాలు

40 people injured in road accident in Peddapalli. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి సమీపంలో రాజీవ్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున

By Medi Samrat  Published on  26 Jun 2023 4:25 PM IST
పెద్దపల్లిలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. 40 మందికి గాయాలు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి సమీపంలో రాజీవ్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండంకు చెందిన ఓ కుటుంబం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లి ఉదయం స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జ‌రిగింది.

ఆటో రిక్షాను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ బ‌స్సుపై నియంత్ర‌ణ కోల్పోయాడు. దీంతో కంట్రోల్ త‌ప్పిన బ‌స్సు రోడ్డు ఢివైడ‌ర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ఘ‌ట‌న‌లో 20 మందికి తీవ్ర గాయాలు కాగా.. మ‌రో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ‘108’ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పెద్దపల్లి ఏసీపీ మహేష్, సుల్తానాబాద్ సీఐ జగదీష్, ఎస్‌ఐ విజయేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story