వారణాసిలో కలకలం.. ఒకే గదిలో ఏపీకి చెందిన నలుగురు ఆత్మహత్య

వారణాసిలోని ఓ ధర్మశాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓకే గదిలో పైకప్పుకు ఉరివేసుకుని మృతి చెందారు.

By అంజి  Published on  8 Dec 2023 6:48 AM IST
Andhra Pradesh, hanging, Varanasi, Crime news

వారణాసిలో కలకలం.. ఒకే గదిలో ఏపీకి చెందిన నలుగురు ఆత్మహత్య

వారణాసిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వారణాసిలోని దేవనాథ్‌పురలోని కైలాష్‌ భవన్‌ ధర్మశాలలో గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓకే గదిలో పైకప్పుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను కొండబాబు (50), అతని భార్య లావణ్య (45), వారి కుమారులు రాజేష్ (25), జైరాం (23)గా గుర్తించినట్లు పోలీసు కమిషనర్ అశోక్ ముఠా జైన్ తెలిపారు. వీరు ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు.

తన జిల్లాలో కొండ బాబుకు ఆర్థిక వివాదం ఉందని, దీంతో ఆ కుటుంబం రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోవలసి వచ్చిందని, గదిలో తెలుగులో రాసిన సూసైడ్ నోట్ లభించింది. వారు వివిధ నగరాలకు ప్రయాణిస్తున్నారు. వారి వద్ద డబ్బులు అయిపోవడంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తదుపరి దర్యాప్తులో మొత్తం సూసైడ్ నోట్‌ను అనువాదం చేయడం, ద్రవ్య వివాదంలో పాల్గొన్న వ్యక్తుల గుర్తింపుతో సహా స్పష్టత లభిస్తుందని జైన్ తెలిపారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యాత్రికుల బృందం సాయంత్రం వారి గదిని తెరవడంలో విఫలమైనప్పుడు భయంకరమైన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మశాల సిబ్బందిని పోలీసులు ఈ ఘటన గురించిన ఆరా తీశారు. సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, గదిలోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా విచారణ చేసేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబం డిసెంబర్ 3న ధర్మశాలకు వచ్చింది.

Next Story