కూలిన గోడ.. నలుగురు మృతి

4 Killed, 6 Injured After Wall Collapses In Shivpuri. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో శనివారం గోడౌన్ గోడ కూలి నలుగురు మృతి చెందగా,

By M.S.R  Published on  21 Jan 2023 8:55 PM IST
కూలిన గోడ.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో శనివారం గోడౌన్ గోడ కూలి నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంఘటన షియోపురా గ్రామంలో జరిగిందని కరేరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సతీష్ చౌహాన్ తెలిపారు. "30-35 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు మహిళలు.. 32 ఏళ్ల వ్యక్తి మరణించారు. మహిళలు వేరుశెనగ నిల్వ చేసిన గోడౌన్‌లో పనిచేస్తున్నారు, ఆ వ్యక్తి డ్రైవర్‌గా ఉన్నారు. ఆరుగురు వ్యక్తులు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు" అని ఆయన అన్నారు.

గోడౌన్ లో స్టాక్ సామర్థ్యం కంటే ఎక్కువగా నిల్వ చేసి ఉంచారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని.. అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందించారు. పోలీసులు గోడౌన్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు.

Next Story