ఆటో రిపేర్ విష‌యంలో గొడవ.. ప్లాన్ చేసి మ‌రీ అంత‌మొందించాడు

ఆటో డ్రైవర్‌ను హత్య చేసినందుకు నలుగురు వ్యక్తులను బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  2 Feb 2025 2:00 PM IST
ఆటో రిపేర్ విష‌యంలో గొడవ.. ప్లాన్ చేసి మ‌రీ అంత‌మొందించాడు

ఆటో డ్రైవర్‌ను హత్య చేసినందుకు నలుగురు వ్యక్తులను బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణ (35) అలియాస్ కిట్టును ఎ కృష్ణ, ఎం.రవి, జి.నరేష్, జి.శంకర్ అనే వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో చెత్తకుప్పలో పడవేశారని పోలీసులు తెలిపారు. జనవరి 29 రాత్రి స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

మొదట్లో గుర్తు తెలియని వ్యక్తి మరణించారని పోలీసులు కేసు నమోదు చేశారు. సమీపంలోని సీసీటీవీల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బాధితుడిని నలుగురు నిందితులు హత్య చేసినట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్లు కృష్ణ, కిట్టు స్నేహితులు. కొద్దిరోజుల క్రితం కృష్ణకు చెందిన ఆటో రిపేర్ చేసే విషయమై వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కృష్ణ తన మరో ముగ్గురు స్నేహితుల సాయంతో కిట్టు హత్యకు కుట్ర పన్నాడు. జనవరి 29న, బాధితుడిని పార్టీ చేసుకుందామని ఆహ్వానించారు. అక్కడ అతనికి మద్యం తాగించారు. ఆ తర్వాత అతన్ని కొట్టి చంపి, అతని మృతదేహాన్ని చెత్తలో పడేశారు.

Next Story