నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి

గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా

By Medi Samrat
Published on : 15 Sept 2023 4:36 PM IST

నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి

గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గౌర్ సిటీలో ఆమ్రపాలి బిల్డర్స్ నిర్మాణాన్ని చేపడుతున్న ఈ ఘటన జరిగింది. "నలుగురు వ్యక్తులు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయ‌ప‌డిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మా బృందం ఆసుపత్రిలో ఉంది. సరైన చికిత్స అందించబడుతుంది. దర్యాప్తు జరుగుతోందని జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ వర్మ తెలిపారు.

గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. ఉదయం 9 గంటలకు.. తొమ్మిది మంది కూలీలు లిఫ్ట్‌లో ఉండగా.. అది 8వ, 9వ అంతస్తుల మధ్య ఇరుక్కుపోయి.. ఒక్క‌సారిగా కూల‌డంతో నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Next Story