కుప్ప కూలిన ఇల్లు.. 9 ఏళ్ల బాలిక సహా నలుగురు దుర్మరణం

4 dead, 2 injured after a house collapses in Delhi. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం నాలుగు అంతస్తుల

By అంజి  Published on  12 Feb 2022 7:48 AM IST
కుప్ప కూలిన ఇల్లు.. 9 ఏళ్ల బాలిక సహా నలుగురు దుర్మరణం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం నాలుగు అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో తొమ్మిదేళ్ల బాలికతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఫాతిమా,షెహ్నాజ్ అనే ఇద్దరు మహిళలు శిథిలాల నుండి రక్షించబడ్డారు. ఆ తర్వాత సమీపంలోని ఆసుపత్రికి పంపించారు. అక్కడ వారు గాయాలకు చికిత్స పొందారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. అయితే షెహనాజ్ కుమార్తెతో పాటు మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడలేదు.

తొమ్మిదేళ్ల అఫ్రీన్‌తో పాటు మరో ముగ్గురు రుకేయా ఖాటూన్, షెహజాద్, డానిష్ శిథిలాల కింద శవమై కనిపించారు. మధ్యాహ్నం 2.45 గంటలకు భవనం కుప్పకూలినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్లో సహాయంగా జేసీబీ యంత్రం, రెండు అంబులెన్స్‌లను కూడా పంపించారు. "కుప్పకూలిన 4 అంతస్తుల భవనం 300-400 ఫ్లాట్ల సమూహమైన రాజీవ్ రతన్ ఆవాస్‌లో ఉంది" అని అగ్నిమాపక దళ అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story