మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం నాడు స్లీపర్ బస్సు ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 May 2023 3:00 PM IST

Bus Crashes , Madhya Pradesh, Crime news, road accident

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం నాడు స్లీపర్ బస్సు ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ప్రయాణికులతో అహ్మదాబాద్‌కు వెళ్తున్న బస్సు షాజాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు, క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

బస్సు ఓవర్‌టేక్ చేస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. తరానా, కాయటా, మక్సీ పోలీస్‌స్టేషన్‌ల నుంచి బృందాలను సంఘటనా స్థలానికి పంపించి సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు పోలీసులకు సహాయం చేశారు. అత్యవసర వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తదుపరి చికిత్స కోసం ఉజ్జయిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.

Next Story