పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 32 ఏళ్ల వ్యక్తి

32-Year-Old Man Dancing At Wedding Collapses. ఎప్పుడు ఎవరిని.. ఎలా మృత్యువు కబళిస్తుందో అసలు ఊహించలేము..!

By M.S.R  Published on  18 Jan 2023 7:45 PM IST
పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 32 ఏళ్ల వ్యక్తి

ఎప్పుడు ఎవరిని.. ఎలా మృత్యువు కబళిస్తుందో అసలు ఊహించలేము..! ఇటీవలి కాలంలో అలాంటి మరణాల గురించి చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. చాలా తక్కువ వయసు ఉన్న వ్యక్తులు గుండెపోటుతో కుప్పకూలిపోతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా అలాంటి మరో ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ 32 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాకు చెందిన అభయ్ సచన్ పెళ్లి కోసం రేవాకు వచ్చాడు. వివాహానికి సంబంధించిన వీడియోలో సచన్ బృందంతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు కింద పడిపోయాడు. బ్యాండ్ డ్రమ్స్ కొడుతూ ఉండగా.. ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.. కానీ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెళ్లి వేడుక కాస్తా శోక సంద్రంగా మారిపోయింది.


Next Story