15 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న 30 ఏళ్ల మ‌హిళ‌

30-year-old woman who had an extra-marital relationship with 15-year-old boy. కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల మహిళ అదృశ్యమవ్వడం

By Medi Samrat  Published on  27 July 2022 3:54 PM IST
15 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న 30 ఏళ్ల మ‌హిళ‌

కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల మహిళ అదృశ్యమవ్వడం స్థానికంగా సంచలనానికి దారి తీసింది. అయితే ఈ కేసును టూ టౌన్ పోలీసులు చేధించగా.. ఈ అపహరణ ఘట్టం వెనుక ఊహించని ట్విస్టులు ఉన్నాయని తేలింది. హైదరాబాద్ బాలానగర్‌లోనీ ఓ గదిలో బాలుడు, మహిళను పోలీసులు గుర్తించారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సదరు మహిళపై ఫోక్సో యాక్ట్, కిడ్నాప్ త‌దిత‌ర సెక్ష‌న్‌ల‌ కింద కేసు నమోదు చేశారు. నలుగురు పిల్లలు ఉన్న స్వప్న నెల రోజులుగా బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకుందని పోలీసులు తెలిపారు. బాలుడితో శాశ్వతంగా ఉండాలనే దురుద్దేశంతో మాయమాటలు చెప్పి ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోయింది. తీరా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇరువురిని గుర్తించారు పోలీసులు.

15 ఏళ్ల బాలుడితో ఆమె శారీరక సంబంధం ఏర్పరచుకున్న కారణంతోనే ఆ పిల్లాడిని పిలుచుకొని వెళ్ళిపోయింది. గుడివాడ గుడ్ మేన్ పేటలో ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న స్వప్న అనే మహిళ, బాలుడు గత 19వ తేదీ నుండి కనిపించకుండా వెళ్లిపోయారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో మాయమాటలతో స్వప్న బాలుడిని అపహరించినట్లు గుర్తించారు పోలీసులు. స్వప్న, బాలుడు కలిసి హైదరాబాద్ బాలానగర్ లో ఉన్నట్లు గుర్తించారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించి బాలుడిని ప్రలోభ పెట్టిన స్వప్న.. గత నెల రోజులుగా శారీరిక సంబంధం ఏర్పరచుకుందని తెలిపారు. మాయమాటలతోనే బాలుడిని స్వప్న కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.











Next Story