మూడేళ్ల చిన్నారిపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం, హత్య.. నిందితుడు అమ్మమ్మ ప్రియుడే

3-year-old girl sexual assault, killed by grandmother's lover. ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికరమైన హత్య, అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ 55 ఏళ్ల వ్యక్తి మూడేళ్ల బాలికపై

By అంజి  Published on  4 Jan 2022 9:32 AM GMT
మూడేళ్ల చిన్నారిపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం, హత్య.. నిందితుడు అమ్మమ్మ ప్రియుడే

ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికరమైన హత్య, అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ 55 ఏళ్ల వ్యక్తి మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి చంపాడు. ఈ కుట్రలో బాలిక అమ్మమ్మ కూడా భాగస్వామ్యం పంచుకుంది. ఎందుకంటే ఆ 55 ఏళ్ల వ్యక్తితో బాలిక అమ్మమ్మ(50) వివాహేతరం సంబంధం నడుపుతోంది. బాలిక తమ వివాహానికి అడ్డంకిగా ఉంటదని భావించి హత్య చేశారు. కాగా సంచలనం సృష్టించిన బాలిక అంధ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డిసెంబరు 25న 3 ఏళ్ల బాలిక మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించి బాలిక కోసం అన్వేషణ చేపట్టారు. నిర్మాణంలో ఉన్న కావేరీ భవనం నుంచి అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని డిసెంబర్ 28న స్వాధీనం చేసుకున్నారు.

సాక్ష్యాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశ్యంతో మృతదేహాన్ని భవనంలో పడి ఉన్న ప్లైవుడ్ దుంగ కింద దాచారు. చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించిన పోస్ట్‌మార్టం ఆధారంగా నిందితులపై అత్యాచారం, హత్య చేసి మృతదేహాన్ని దాచిపెట్టడం, అసహజ దుశ్చర్యల వంటి అభియోగాలతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు హేమంత్‌ను పోలీసులు సోమవారం సెక్టార్ 88 పార్క్ వద్ద అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఆమె పాత్ర కోసం బాలిక అమ్మమ్మను కూడా అదుపులోకి తీసుకున్నారు.

'వివాహానికి ఆటంకం'

నిందితుడు హేమంత్‌ అలియాస్‌ మునిమ్‌తో మృతురాలి అమ్మమ్మ నీరజ్‌ శర్మకు అక్రమ సంబంధాలున్నట్లు పోలీసుల సమగ్ర విచారణలో తేలింది. హేమంత్ ఖాన్‌పూర్ బులంద్‌షహర్ జిల్లా నివాసి, సబ్జీ మండి సెక్టార్ 88 ఫేజ్ 2 నోయిడా గౌతమ్ బుద్ నగర్‌లో నివసిస్తున్నారు. నేరపూరిత మానసిక ధోరణులతో రెచ్చిపోయిన హేమంత్ తమ ప్రేమ వ్యవహారానికి, వివాహానికి అడ్డుగా ఉంటుందని భావించి, ఆమె అమ్మమ్మ నీరజ్ శర్మతో కలిసి కుట్ర పన్ని దారుణంగా హత్య చేశాడు.

Next Story
Share it