మూడేళ్ళ బాలిక ప్రాణం తీసిన గ్లాస్ డోర్

షోరూమ్‌లోని పెద్ద గాజు తలుపు పడటంతో మూడేళ్ల బాలిక మృతి చెందింది.

By Medi Samrat  Published on  28 Nov 2023 9:12 PM IST
మూడేళ్ళ బాలిక ప్రాణం తీసిన గ్లాస్ డోర్

షోరూమ్‌లోని పెద్ద గాజు తలుపు పడటంతో మూడేళ్ల బాలిక మృతి చెందింది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఘుమర్‌ మండి మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలిక గ్లాస్ డోర్ తలుపు హ్యాండిల్‌ను పట్టుకున్న వెంటనే అది ఆమె మీద పడడం సీసీటీవీలో రికార్డు అయింది. తలుపు బాలిక మీద పడిన వెంటనే, ఆమె కుటుంబ సభ్యులు, షోరూమ్‌లో పనిచేస్తున్న వ్యక్తులు ఆమె వద్దకు పరిగెత్తారు. గాజు తలుపు క్రింద నుండి బయటకు లాగారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలని పలువురు ఈ ఘటన గురించి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

Next Story