ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దొంగతనానికి సంబంధించిన గొడవ కారణంగా మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడు ఆ తర్వాత ప్రాణాలు విడిచాడు. కొందరు గ్రామస్థులు కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో చిన్నారి, వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదేరోజు రాత్రి బరేలీలో చికిత్స పొందుతూ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.
షాజహాన్‌పూర్‌లోని నిగోహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. మనోజ్ సింగ్ అనే వ్యక్తి దుకాణంలో ఛోటేలాల్ దొంగతనం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో మనోజ్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కర్రలు, పదునైన వస్తువులతో కలిసి దాడి చేశాడు. తీవ్ర వాగ్వాదం జరుగుతుండగా, మూడేళ్ల చిన్నారి, ఇతర కుటుంబ సభ్యులపై కూడా దాడి జరిగింది. ఆ ప్రమాదంలో గాయాలపాలై పిల్లాడు మరణించాడు.
కుటుంబ సభ్యులు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం బయట కూర్చొని పిల్లాడి మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సరైన చర్యలు తీసుకోవాలని.. కుటుంబ సభ్యులు పోలీసుల కాళ్లపై పడ్డారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.