ఊహించని ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మహిళలు

ఏప్రిల్ 12, శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాలలో వర్షం కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat  Published on  13 April 2024 8:45 PM IST
ఊహించని ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మహిళలు

ఏప్రిల్ 12, శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాలలో వర్షం కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తాడూరు మండలం ఐతోల్ గ్రామంలో విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన తస్లీమ్ బేగం (45), అలియా బేగం (40) అనే ఇద్దరు మహిళలు మరణించారు. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఘటనలో తాడూరు మండలం ఉప్పునుంతల గ్రామంలో పిడుగుపాటుకు గురై జి.శ్యామలమ్మ(34) మృతి చెందింది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్‌, కొమ్మరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ విభాగం తెలిపింది.

Next Story