మహాబలిపురంలో తెలుగు విద్యార్థుల గల్లంతు

మహాబలిపురం.. ప్రముఖ టూరిస్ట్ ప్లేస్. ఎన్నో రాష్ట్రాల నుండి యువత ఇక్కడకు వస్తూ ఉంటారు.

By Medi Samrat  Published on  2 March 2024 1:00 PM
మహాబలిపురంలో తెలుగు విద్యార్థుల గల్లంతు

మహాబలిపురం.. ప్రముఖ టూరిస్ట్ ప్లేస్. ఎన్నో రాష్ట్రాల నుండి యువత ఇక్కడకు వస్తూ ఉంటారు. అలా వెళ్లిన తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతవ్వడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులోని మహాబలిపురంలో శనివారం సముద్రపు నీటిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు గల్లంతైన ఘటన.. విహార యాత్రను కాస్తా.. విషాదకరంగా మార్చింది.

విద్యార్థులు ఈతకు వెళ్లినప్పుడు.. సముద్రంలో లోతుగా వెళ్లినప్పుడు పెద్ద అలలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్‌తో పాటు పోలీసులు గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరుకు చెందిన బాధితులు మరో 18 మంది కళాశాల విద్యార్థులతో కలిసి మహాబలిపురం పర్యటనకు వెళ్లారు. గల్లంతైన ముగ్గురు విద్యార్థులు బంగారుపాలెం, సుధం, పుల్లిచెర్ల వాసులుగా గుర్తించారు. విద్యార్థులు మౌనీష్, విజయ్, ప్రభుల కుటుంబం వారి రాక కోసం ఎదురుచూస్తూ ఉంది.

Next Story