సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోస్టులు.. ముగ్గురు అరెస్ట్‌

కత్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు యువకులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 17 April 2025 5:15 PM IST

సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోస్టులు.. ముగ్గురు అరెస్ట్‌

కత్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు యువకులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక గంజాయి సేవించినందుకు కూడా ప్రత్యేక కేసు నమోదు చేయబడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకు ముగ్గురు యువకులు కొత్తూరి సాయి వర్ధన్, కావలే ఆశిష్, కొచాడే నీలేష్ అరెస్టును ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు ధృవీకరించారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసిన సమయంలో, వారు గంజాయి సేవించారో లేదో తెలుసుకోవడానికి పోలీసులు వేర్వేరు పరీక్షలు నిర్వహించారు.

సాయి వర్ధన్, ఆశిష్ గంజాయి సేవించారని నిర్ధారించుకున్న తర్వాత, పోలీసులు వారిపై డ్రగ్స్ కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న ఈ ముగ్గురూ ఆదిలాబాద్ పట్టణ నివాసితులు. సోషల్ మీడియాలో ప్రజలను బెదిరిస్తూ పోస్ట్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Next Story