బ‌ర్త్ డే కేక్‌ కోసం వెళ్లి అనంతలోకాలకు..

3 Dead In Chevella Accident. చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు

By Medi Samrat  Published on  27 Aug 2021 3:50 PM GMT
బ‌ర్త్ డే కేక్‌ కోసం వెళ్లి అనంతలోకాలకు..

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. స్నేహితుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కోసం చేవెళ్ల వెళ్ళిన యువకులు అనంతలోకాలకు వెళ్ళిన ఘటన అందరినీ కలిచివేసింది. జయవర్ధన్ అనే తోటి స్నేహితుడి పుట్టినరోజు ఉండడంతో ముగ్గురు స్నేహితులు బైక్ పై చేవెళ్లకు వెళ్లారు. సుమారు ఏడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై నుండి ఎగిరిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ముగ్గురి ప్రాణాలు పోయాయి. అప్పటివరకూ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన ముగ్గురు యువకులు చనిపోవడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Next Story
Share it