పెళ్లి త‌ర్వాత పెళ్లి.. వ‌య‌సు 28.. వివాహాలు 24

28 Years Old Bengal Conman Married 24 Women. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసబుల్ మొల్లా అనే యువకుడు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకోవడం

By Medi Samrat  Published on  1 Oct 2022 4:09 PM IST
పెళ్లి త‌ర్వాత పెళ్లి.. వ‌య‌సు 28.. వివాహాలు 24

పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసబుల్ మొల్లా అనే యువకుడు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకోవడం సంచలనం సృష్టించింది. అది కూడా 28 ఏళ్ల వయసులోనే ఈ రికార్డును అందుకున్నాడు. సొంత రాష్ట్రంలోనే కాకుండా పక్కనున్న బిహార్‌లోనూ పెళ్లిళ్లు చేసుకున్నాడు. సాగర్ దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను అసబుల్ మొల్లా వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత మాయమైపోయాడు. ఇంట్లోనే ఉన్న ఆమె నగలు కూడా కనిపించకుండా పోయాయి. దీంతో అనుమానం వచ్చిన ఆమె భర్త మోసం చేశాడని సాగర్ దిగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఇలా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలుస్తోంది. ఒక చోట అనాథ అని, మరో చోట జేసీబీ డ్రైవర్ అని, ఇంకో చోట కూలీ ఇలా పేర్లు మార్చుకుంటూ తిరిగేవాడు. అలా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యే వాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసబుల్ ను పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడి బాగోతం బయట పడింది. అసబుల్ చేతిలో మోసపోయిన యువతులు బయటికొచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.


Next Story