ఇంట్లో కాలిపోయిన 25 ఏళ్ల మహిళ మృతదేహం.. చెల్లెలు అదృశ్యం

25-year-old woman’s charred body found at home, sister missing in Kerala. కేరళలోని ఉత్తర పరవూర్‌లో పాక్షికంగా కాలిపోయిన ఇంట్లో మహిళ మృతదేహం లభ్యమైంది. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె సోదరి

By అంజి  Published on  30 Dec 2021 5:37 AM GMT
ఇంట్లో కాలిపోయిన 25 ఏళ్ల మహిళ మృతదేహం.. చెల్లెలు అదృశ్యం

కేరళలోని ఉత్తర పరవూర్‌లో పాక్షికంగా కాలిపోయిన ఇంట్లో మహిళ మృతదేహం లభ్యమైంది. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె సోదరి ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టారు. నార్త్ పరవూరులోని పనోరమా నగర్ సమీపంలోని ఆమె ఇంటిలో 25 ఏళ్ల విస్మయ అనే మహిళ మృతదేహం లభ్యమైంది. పొరుగువారు మంటలను గుర్తించడంతో అక్కడి నుంచి పారిపోయిన ఆమె సోదరి కోసం పోలీసు అధికారులు ఇంకా వెతుకుతున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి, ఇంటి ముందు తలుపు దగ్గర రక్తపు మరకలు కూడా కనిపించాయి. "సంఘటన తర్వాత బాధితురాలి చెల్లెలు రోడ్డు వెంబడి నడుస్తున్నట్లు చూపించే కొన్ని సీసీటీవీ విజువల్స్‌ను మేము సేకరించాము" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. విస్మయ మొబైల్ కనిపించకుండా పోయిందని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డతఅగ్నిమాపక దళం అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ముందు గేటు బయటి నుంచి తాళం వేసి ఉంది. మృతదేహం ఉన్న గది కూడా మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story
Share it