లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. పాపం ఆ మ‌హిళ‌..

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల గురించి రోజుకో దారుణం బయటపడుతూ ఉంది. డబ్బులు చెల్లించినా.. చెల్లించకపోయినా కూడా ఊహించని విధంగా ఇబ్బందులు తెస్తూ ఉంటారు

By Medi Samrat  Published on  25 July 2024 7:30 PM IST
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. పాపం ఆ మ‌హిళ‌..

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల గురించి రోజుకో దారుణం బయటపడుతూ ఉంది. డబ్బులు చెల్లించినా.. చెల్లించకపోయినా కూడా ఊహించని విధంగా ఇబ్బందులు తెస్తూ ఉంటారు. మీ ఫోటోలను మార్ఫింగ్ చేశాము.. వాటిని ఆన్ లైన్ లో పెడతామంటూ వేధింపులు ఎదుర్కొన్న ఎంతో మంది ఏమి చేయాలో తెలియక ప్రాణాలు కూడా తీసేసుకున్నారు. ముంబైకు చెందిన ఓ మహిళ వేధింపులు భరించలేక మానసిక వేదనను అనుభవిస్తోంది. ట్రోమా లోకి జారుకుంది.

ఇన్‌స్టంట్ లోన్ యాప్ నుండి రుణం తీసుకోవాలని అనుకున్న 25 ఏళ్ల మహిళకు రుణాన్ని ఇవ్వకపోవడమే కాకుండా ఆమెను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. ఆమె ఫోటో, ఇతర వివరాలను తీసుకుని ఆమెను వేధించడం మొదలుపెట్టారు. మార్ఫింగ్ చేసిన అశ్లీల చిత్రాలను ఆమె కుటుంబంతో పంచుకుంటామని బెదిరించారు. బాధితురాలు బైకుల్లాలోని ఘోడప్‌దేవ్‌ నివాసి. ఏప్రిల్‌లో ఆమె తన ఫోన్‌లో ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంది. ఆమె తన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, బంధువుల ఆప్షనల్ నంబర్లను ఇచ్చింది. అయితే ఆమెకు రుణం రాకపోవడంతో, ఆమె తన ఫోన్ నుండి యాప్‌ను తొలగించింది.

ఇక సోమవారం ఆమెకు తెలియని మొబైల్ నంబర్ నుండి రుణం చెల్లించాలని, లేకపోతే ఆమె మార్ఫింగ్ చేసిన ఫోటోగ్రాఫ్‌లను కుటుంబ సభ్యులతో పంచుకుంటామని ఆమెకు వాట్సాప్ సందేశం వచ్చింది. మెసేజ్‌లో ఆమె అశ్లీల ఫోటోలు కూడా ఉన్నాయి. ఆమెను తిట్టడం కూడా మొదలుపెట్టాడు. ఆ మెసేజీని చూసిన మహిళ షాక్ లో ఉండిపోయింది. ఈ ఘటన గురించి ఆమె కుటుంబసభ్యులకు, బంధువులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. సంబంధిత సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

Next Story