కాలేజీ స్టూడెంట్‌ను చంపిన‌ ఆరుగురు మైనర్లు

22-year-old college student stabbed to death by six minors after heated argument in Indore. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నూతన సంవత్సరం సందర్భంగా చోటు చేసుకున్న గొడవ..

By M.S.R  Published on  3 Jan 2023 7:30 PM IST
కాలేజీ స్టూడెంట్‌ను చంపిన‌ ఆరుగురు మైనర్లు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నూతన సంవత్సరం సందర్భంగా చోటు చేసుకున్న గొడవ.. ఓ యువకుడి ప్రాణాలు తీసింది. 22 ఏళ్ల కాలేజీ విద్యార్థిని ఆరుగురు మైనర్లు కత్తితో పొడిచి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. నిందితులు ఆరుగురు మైనర్లేనని తెలిసింది. ఈ ఘటన నగరంలోని భన్వర్కువాన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. చనిపోయిన యువకుడిని ఆయుష్‌గా గుర్తించారు. రోడ్డుపై ఆయుష్, నిందితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ షాకింగ్ ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సెక్యూరిటీ కెమెరాలో రికార్డయింది.

ఇద్దరు స్నేహితులతో కలిసి మోటార్‌సైకిల్‌పై బాధితుడు వెళుతున్నాడు. హారన్‌ కొట్టి దారి నుండి పక్కకు వెళ్ళమని నిందితులను కోరారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర వాగ్వాదం తర్వాత, మోటారుసైకిల్‌ను వెంబడించి, వారిలో ఒకరు ఆయుష్‌ను కత్తితో పొడిచాడు. బాధితుడు బైక్‌పై చివరిగా కూర్చోవడంతో కత్తి శరీరంలోకి దూసుకుపోయింది. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయాలపాలైన అతడు మృతి చెందాడు. నిందితుల్లో ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు. నేరం అనంతరం మైనర్లంతా అక్కడి నుంచి పారిపోయారు. వారిని పోలీసులు అరెస్టు చేసి హత్యానేరం మోపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


Next Story