డ్యాన్స్ చేస్తుండ‌గా హార్ట్ అటాక్..!

21-Year-Old Man Collapses Dies While Performing Garba in Gujarat. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో డ్యాన్స్ చేస్తూ 21 ఏళ్ల యువకుడు ఆదివారం కుప్పకూలిపోయాడు.

By Medi Samrat  Published on  3 Oct 2022 4:58 PM IST
డ్యాన్స్ చేస్తుండ‌గా హార్ట్ అటాక్..!

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో డ్యాన్స్ చేస్తూ 21 ఏళ్ల యువకుడు ఆదివారం కుప్పకూలిపోయాడు. తారాపూర్‌లోని శివశక్తి సొసైటీ ఆనంద్‌లో గర్బా సెషన్‌ను నిర్వహించింది. వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్‌పుత్ స్పృహ తప్పి పడిపోయే ముందు వరకూ గార్బా డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ ఘటన మొత్తాన్ని అతని స్నేహితుడు వీడియోలో తీశాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వీరేంద్ర మృతి చెందాడు. అతను గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు. వీరేంద్ర తండ్రి గుజరాత్‌లోని మోరాజ్ గ్రామంలోని పాఠశాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

"Anand : A man died while playing Garba. Garba was organized in Aati Shivshakti Society in Tarapur. The youth was taken to the hospital but by then it was too late. The cause of death is said to be due to a heart attack." అంటూ ట్విట్టర్ యూజర్ వీడియోను షేర్ చేశారు. అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ వస్తున్నాడు.. ఆ వీడియోను రికార్డు చేస్తూ ఉండగానే.. ముందుకు ఒరిగి పడిపోయాడు.


Next Story