దారుణం.. తండ్రి కళ్లేదుటే రెండేళ్ల చిన్నారి హత్య.. ఆ విషయంలో గొడవ

2 year's old son murdered in front of father in Bihar. తండ్రి కళ్ల ముందే రెండేళ్ల వయసున్న అమాయక కుమారుడిని ఇద్దరు యువకులు గురువారం హత్య చేశారు.

By అంజి  Published on  11 Nov 2022 9:14 AM GMT
దారుణం.. తండ్రి కళ్లేదుటే రెండేళ్ల చిన్నారి హత్య.. ఆ విషయంలో గొడవ

తండ్రి కళ్ల ముందే రెండేళ్ల వయసున్న అమాయక కుమారుడిని ఇద్దరు యువకులు గురువారం హత్య చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌ రాష్ట్రంలోని భరత్‌పుర్‌ జిల్లాలో జరిగింది. చిన్న పిల్లల మధ్య మొదలైన గొడవ చిలికి.. చిలికి పెద్దోళ్ల దగ్గరికి వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఖజారియా జిల్లా అగ్వని పార్బట్ట గ్రామానికి చెందిన పవన్‌ తన ఫ్యామిలీతో కలిసి బరారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాత రైల్వే క్వార్టర్‌ సమీపంలో నివాసం ఉంటున్నాడు.

అదే పరిసరాల్లో మనోజ్‌ దామ్‌ అనే వ్యక్తి కూడా నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం పవన్, మనోజ్ రెండు కుటుంబాల మధ్య చిన్నారి ఆడుకునే సమయంలో గొడవ జరిగింది. చిన్నగా మొదలైన గొడవ.. చిలికి చిలికి పెద్దదిగా మారింది. అదే సమయంలో మనోజ్.. పవన్ కొడుకును చంపేస్తానని బెదిరించాడు. గురువారం మనోజ్, రాహుల్.. పవన్ ఇంటికి చేరుకుని అతడి ఏడాది వయసున్న చిన్నారిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత రాహుల్ చిన్నారిని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా గాల్లోకి లేపాడు.

బాలుడు ఎంత అరిచినా విడిచిపెట్టలేదు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో బాలుడు మృతి చెందాడు. ఇదంతా తండ్రి కళ్ల ముందే జరిగింది. కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రిపై యువకులిద్దరూ కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story