బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ మిక్సర్ లారీ (లారీ) గోడను ఢీకొనడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన చిన్నారిని ప్రణవ్‌గా గుర్తించారు. గోడ దగ్గర పిల్లాడు ఆడుకుంటున్నాడు. ఇంతలో లారీ అదుపుతప్పి గోడను ఢీకొనడంతో బాబు మృతి చెందాడు.
బెంగళూరులో శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లాడు రోడ్డు పక్కన తన ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఇంతలో రోడ్డు మీదుగా వెళ్తున్న లారీ ఓవర్ హెడ్ కేబుల్‌కు చిక్కింది. ఈ సమయంలో లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ గోడను ఢీకొంది. ఆ సమయంలో గోడ దగ్గర ఆడుకుంటున్న పిల్లాడి మీద శిధిలాలు పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
లారీ డ్రైవర్ హరీష్ ప్రస్తుతం కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో గోడ దగ్గర ఆడుకుంటున్న చిన్నారి ప్రణవ్ అని హెచ్‌ఏఎల్ పోలీసులు తెలిపారు.