ఉత్తరాఖండ్ లో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీలు
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 6 July 2024 2:15 PM GMTహైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాడు కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు ఢీకొని మరణించినట్లు పోలీసులు తెలిపారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య చత్వాపీపాల్ సమీపంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నిర్మల్ షాహి (36), సత్య నారాయణ (50)లు మోటారు సైకిల్‌పై తిరిగి వస్తుండగా కొండపై నుంచి బండరాళ్లు పడ్డాయని పోలీసులు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి వారి మృతదేహాలను బయటకు తీశామని పోలీసు అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారి పలు ప్రాంతాల్లో మూసుకుపోయింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది రోడ్లను క్లియర్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కొండచరియలు విరిగిపడటంతో రుద్రప్రయాగ్-కేదార్‌నాథ్ జాతీయ రహదారి కూడా మూసుకుపోయింది. ముందుజాగ్రత్త చర్యగా రుద్రప్రయాగ్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను శనివారం మూసివేశారు. శని, ఆదివారాల్లో కుమావోన్, గర్వాల్ ప్రాంతాలకు వాతావరణ శాఖ "భారీ నుండి అతి భారీ వర్షపాతం" కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది.