ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఇద్ద‌రు మృతి

2 killed as fire engulfs nursing home in Delhi's Greater Kailash area. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో

By Medi Samrat  Published on  1 Jan 2023 9:40 AM IST
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఇద్ద‌రు మృతి

ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున దాదాపు 5:15 గంటలకు నర్సింగ్‌హోమ్‌లో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలం నుంచి ఆరుగురిని రక్షించినట్లు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ధృవీకరించారు. మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న‌ట్లు తెలిపారు. మంటలు ఆర్పి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సివుంది.

అంతకుముందు.. డిసెంబర్ 29న ఓ భవనంలో మంటలు చెలరేగడంతో మొదటి, రెండవ అంతస్తుల‌లో చిక్కుకున్న 14 మందిని ఢిల్లీ పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది రక్షించారు. ఈ ఘటన ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో జరిగింది. 14 మంది (నలుగురు ఆడవారు, ఐదుగురు మగవారు, ఐదుగురు పిల్లలు) ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు.


Next Story