సౌదీ నుండి తిరిగొచ్చాడు.. ప్రాణాలు కోల్పోయాడు

సౌదీ నుండి తిరిగి వచ్చిన 31 ఏళ్ల యువకుడిని హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on  1 July 2024 4:15 PM GMT
సౌదీ నుండి తిరిగొచ్చాడు.. ప్రాణాలు కోల్పోయాడు

సౌదీ నుండి తిరిగి వచ్చిన 31 ఏళ్ల యువకుడిని హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగిలోని మంచిరేవులలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులను బాధితుడి భార్య సీమ, ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఆరిఫ్‌గా గుర్తించారు.

నార్సింగి పోలీసులు మాట్లాడుతూ.. బాధితుడు విదేశాలకు వెళ్ళిన తర్వాత, ఆరిఫ్ సీమాను ఒక కార్యక్రమంలో కలుసుకున్నాడు. వారు సన్నిహితంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. పదిహేను రోజుల క్రితం బాధితుడు సయ్యద్ హిదాయత్ అలీ తిరిగి వచ్చి.. తన భార్య సీమను కారులో మంచిరేవులకు తీసుకెళ్లాడు. ఆరిఫ్ సీమకు సంబంధించిన అభ్యంతరకరమైన కంటెంట్‌ను రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు, బాధితుడి నుండి డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు డబ్బులు చెల్లించడానికి అంగీకరించాడు. నిందితుడు అతన్ని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లినప్పుడు అక్కడ పెనుగులాట జరిగింది. ఈ సమయంలో ఆరిఫ్ బాధితుడిని కత్తితో పొడిచి గొంతు పిసికి చంపేశాడు. బాధితుడు సయ్యద్ హిదాయత్ అలీ సౌదీ అరేబియాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

Next Story