విషాదం.. సీలింగ్ గ్రిల్ పడి ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి

గ్రేటర్ నోయిడాలోని ఒక మాల్ లాబీలో సీలింగ్ గ్రిల్ పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

By Medi Samrat  Published on  3 March 2024 5:45 PM IST
విషాదం.. సీలింగ్ గ్రిల్ పడి ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి

గ్రేటర్ నోయిడాలోని ఒక మాల్ లాబీలో సీలింగ్ గ్రిల్ పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. బ్లూ సఫైర్ మాల్ లో ఈ ప్రమాదం జరిగింది. హరేంద్ర భాటి, షకీల్ అనే 35 ఏళ్ల వయసున్న వ్యక్తులు సీలింగ్ గ్రిల్ కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బ్లూ సఫైర్ మాల్ కు ఆదివారం కావడంతో చాలామంది వచ్చారు. షాపింగ్ మాల్ లోని లాబీలో ఎక్సలేటర్ పక్కనే దగ్గర సీలింగ్ ఐరన్ గ్రిల్ ఒక్కసారిగా హరేంద్ర భాటి, షకీల్ పై ఊడిపడింది. ఆ గ్రిల్ ఐదవ అంతస్థు నుంచి వారిపై పడిపోయింది. వీరిద్దరూ ఘజియాబాద్‌కు చెందినవారు.

ఈ సంఘటన మాల్‌కు వెళ్లేవారిలో భయాందోళనలకు దారితీసింది. సీనియర్ పోలీసు అధికారులు, సిబ్బంది ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మాల్ ఐదవ అంతస్తు నుండి ఇనుప గ్రిల్ పడిపోయిందని అదనపు డిసిపి హృదేష్ కఠారియా తెలిపారు.

Next Story