శివ్ ఖోరీ ఆలయానికి వెళుతున్న బస్సు.. ఇంతలో..!

2 Dead, 19 Injured As Bus With Devotees Falls Into Gorge In Jammu And Kashmir. జమ్మూ కశ్మీర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

By M.S.R  Published on  18 Feb 2023 7:45 PM IST
శివ్ ఖోరీ ఆలయానికి వెళుతున్న బస్సు.. ఇంతలో..!

జమ్మూ కశ్మీర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం నాడు రియాసి జిల్లాలో శివ్ ఖోరీ ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడడంతో ఇద్దరు మృతి చెందగా, 19 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. రాన్సు ప్రాంతంలోని తర్యాత్ వద్ద మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాజౌరి నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శివ్ ఖోరీకి యాత్రికులతో బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ వెంటనే అధికారులు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు, వారిలో ఇద్దరు మరణించినట్లు ప్రకటించారు. 12 మంది గాయపడిన వారిని ప్రత్యేక చికిత్స కోసం జమ్మూ లోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఆసుపత్రికి పంపినట్లు అధికారులు తెలిపారు.


Next Story