విషాదం.. కారు ఢీకొనడంతో ఇద్దరు పోలీసులు మృతి.. మద్యం మత్తే

2 cops die after being hit by drunk driver in Goa. గోవా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు.. ఇద్దరు పోలీసులను ఢీ కొట్టింది.

By అంజి  Published on  16 Jan 2022 8:45 AM GMT
విషాదం.. కారు ఢీకొనడంతో ఇద్దరు పోలీసులు మృతి.. మద్యం మత్తే

గోవా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు.. ఇద్దరు పోలీసులను ఢీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున సౌత్ గోవాలోని కోల్వా బీచ్ గ్రామంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో కారు డ్రైవర్ ఢీకొట్టడంతో మరణించారు. కోల్వా పోలీస్ స్టేషన్‌లోని అధికారుల ప్రకారం.. మరణించిన పోలీసు సిబ్బంది శైలేష్ గాంకర్ (30), విశ్వాస్ దేకర్ (32)గా గుర్తించారు. ప్రమాదంలో కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రి తరలించే ప్రయత్నం చేశారు.. కానీ కానిస్టేబుళ్లు ఇద్దరు మార్గం మధ్యలో కన్నుమూశారు.

కోల్వా చెక్‌పాయింట్‌ దగ్గర క్రేగ్ రోడ్రిగ్స్ నడుపుతున్న స్కోడా కారు వేగంగా ఢీకొట్టబడింది. "చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తీసుకువెళుతుండగా ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మరణించారు." అని గోవా పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. నిందితుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పరీక్షలో తేలింది. నిందితుడు రోడ్రిగ్స్‌ను అరెస్టు చేసి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పోలీసులు మృతి చెందడంతో.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Next Story
Share it