19 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. గడ్డివాము చాటుకు తీసుకెళ్లి

19-year-old woman sexual assault in Mumbai's Govandi. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మరో దారుణ ఘటన జరిగింది. ముంబైలోని గోవండి ప్రాంతంలో శనివారం ఉదయం 19 ఏళ్ల మహిళపై నలుగురు

By అంజి  Published on  23 Jan 2022 3:47 AM GMT
19 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. గడ్డివాము చాటుకు తీసుకెళ్లి

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మరో దారుణ ఘటన జరిగింది. ముంబైలోని గోవండి ప్రాంతంలో శనివారం ఉదయం 19 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శివాజీ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. రిపోర్ట్‌ ప్రకారం.. మహిళ కొంతమంది క్యాటరర్‌లతో పని చేసి, పని నుండి ఇంటికి వెళుతుండగా నిందితుడు ఆమెను సంప్రదించాడు. వారిలో ఒకరు తనకు కొంత పని ఉందని, ఆమెతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు.

ఆ తర్వాత నిందితుడు మహిళను మురికివాడలోని ఓ గడ్డివాము వద్దకు తీసుకెళ్లి అక్కడ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), ఇతర సంబంధిత నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వజ్రేశ్వరి, ముంబ్రా, వాషి, బేలాపూర్, వడాలా, సీఎస్‌ఎమ్‌టీ, ఎల్‌టీ మార్గ్, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లకు కనీసం 10 పోలీసు బృందాలను పంపినట్లు అధికారి తెలిపారు. శనివారం మధ్యాహ్నం రైలులో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు మైనర్‌లను సాంకేతిక ఇన్‌పుట్‌ల సహాయంతో అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. విచారణ తర్వాత, పోలీసులకు మరో మైనర్ నిందితుడి గురించి సమాచారం వచ్చింది, అతన్ని కూడా పట్టుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story
Share it