19 సంవత్సరాల యువతి ఆత్మహత్య.. కారణం ఏమిటంటే..?

19-year-old girl commits suicide in Guwahati. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం

By M.S.R  Published on  11 Jan 2022 2:08 PM IST
19 సంవత్సరాల యువతి ఆత్మహత్య.. కారణం ఏమిటంటే..?

చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఓ 19 సంవత్సరాల యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. గౌహతిలో 19 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు అనుమతి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. సోమవారం సాయంత్రం ఆమె తన గదిలోని సీలింగ్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.

ఆమె గౌహతిలోని కాలేజీలో చదువుతోంది. హతిసిలాలో విహారయాత్రకు వెళ్లనివ్వకుండా ఆమెను తల్లిదండ్రులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. స్నేహితులు వెళ్లారు.. తనకు మాత్రం అనుమతి నిరాకరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని.. సోమవారం సాయంత్రం ఆమె తన గదిలోని సీలింగ్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ.. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story