ఘోర ప్రమాదం.. పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 10 July 2024 9:19 AM ISTఘోర ప్రమాదం.. పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మరణించారు. 19 మంది గాయపడ్డారు. బస్సు బీహార్‌లోని మోతీహరి నుంచి ఢిల్లీకి వెళ్తోందని ఉన్నావ్ జిల్లా మేజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ తెలిపారు. గార్హా గ్రామ సమీపంలో పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తాకిడికి బస్సు పల్టీ కొట్టి, వాహనంలో నుంచి జనం బయట పడ్డారు.
పోలీసులు, ఇతర అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను బయటకు తీసి, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. అక్కడి దృశ్యాలు నేలపై పడి ఉన్న మృతదేహాలు, మెలితిప్పిన మెటల్ స్క్రాప్‌లు, పగిలిన గాజులు, ధ్వంసమైన శిథిలాలను చూపించాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. ప్రాథమిక విచారణలో బస్సు ఓవర్ స్పీడ్‌గా ఉందని డిఎం గౌరంగ్ రాఠీ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. "దుఃఖంలో ఉన్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించాం" అని ఆయన తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి దయాశంకర్‌సింగ్ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులందరికీ సరైన వైద్యం అందేలా జిల్లా యంత్రాంగం, రవాణా శాఖ అధికారులకు సూచనలు చేశామని తెలిపారు.