ఈ ఇద్దరు మహిళల వద్ద సోదాలు చేస్తే

1.53 Crore-Drugs, Hidden In Soap Cases, Seized From 2 Women In Mizoram. మిజోరాంలో ఇద్దరు మహిళల వద్ద భారీ ఎత్తున డ్రగ్స్ దొరికాయి.

By M.S.R  Published on  30 May 2023 7:45 PM IST
ఈ ఇద్దరు మహిళల వద్ద సోదాలు చేస్తే

మిజోరాంలో ఇద్దరు మహిళల వద్ద భారీ ఎత్తున డ్రగ్స్ దొరికాయి. ఐజ్వాల్‌లోని వెంగ్త్‌లాంగ్ ప్రాంతంలోని ఈ మహిళల దగ్గర ఏకంగా ₹ 1.53 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. అస్సాం రైఫిల్స్, ఐజ్వాల్‌లోని స్పెషల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌ల సంయుక్త బృందం సోమవారం రిపబ్లిక్ వెంగ్త్‌లాంగ్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. 28, 26 ఏళ్ల వయస్సు గల ఇద్దరు మహిళా డ్రగ్స్ స్మగ్లర్ల నుండి ₹ 1.53 కోట్ల విలువైన 306 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై అస్సాం రైఫిల్స్ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ ను తరలించాలని చూసారు. ఏకంగా 22 సబ్బు కేసుల్లో హెరాయిన్‌ను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నిషిద్ధ వస్తువులను, ఇద్దరు నిందితులను స్పెషల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ CID (క్రైమ్)కి అప్పగించారు.


Next Story