లోయలో పడిన వాహనం.. 14 మంది దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

14 dead after vehicle falls into gorge in Uttarakhand's Champawat. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలోని సుఖిధాంగ్ రీతా సాహిబ్ రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.

By అంజి  Published on  22 Feb 2022 7:02 AM GMT
లోయలో పడిన వాహనం.. 14 మంది దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలోని సుఖిధాంగ్ రీతా సాహిబ్ రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వాహనం లోయలో పడి 14 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ బృందం రెస్క్యూ సహాయక పనుల కోసం ఘటనాస్థలికి చేరుకుంది. కుమావోన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపిన వివరాల ప్రకారం.. వాహనంలో ఉన్న బృందం ఒక వివాహానికి హాజరైన తర్వాత తిరిగి వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. స్థానిక యంత్రాంగం సహాయ, సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ హిందీలో ఇలా రాశారు.. "ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది."

గతేడాది అక్టోబర్‌లో ఇలాంటి రెండు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐదుగురు పర్యాటకులు ఫర్సాలీలోని బెటాప్ డ్రెయిన్ సమీపంలో వాహనం బోల్తా పడి మరో కారును ఢీకొని లోయలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మరో సంఘటనలో.. ఉత్తరాఖండ్‌లోని చక్రతాలో వారు ప్రయాణిస్తున్న యుటిలిటీ బస్సు లోయలో పడిపోవడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

Next Story