గుజరాత్ లో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

12 killed as factory wall collapses in Gujarat's Morbi. గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో 12 మంది

By Medi Samrat  Published on  18 May 2022 2:42 PM IST
గుజరాత్ లో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో 12 మంది మరణించారు. మోర్బిలోని హల్వాద్ జిఐడిసిలో ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కింద ఉన్నారని అధికారులు తెలిపారు.

గుజరాత్‌లోని మోర్బీలో బుధవారం మధ్యాహ్నం ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. హల్వాద్ జీఐడీసీ (గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లోని సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉప్పు కర్మాగారంలో గోడ కూలి 12 మంది మరణించారని రాష్ట్ర మంత్రి బ్రిజేష్ మెర్జా ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతోపాటు మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. "మోర్బిలో గోడ కూలిపోవడం వల్ల చోటు చేసుకున్న విషాదం హృదయ విదారకంగా ఉంది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తున్నారు" అని ఆయన అన్నారు. కార్మికుల మృతికి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.














Next Story